Thursday, 5 November 2026

ఓయూ తెర వెనుక తెరాస నాయకులే

– రాహుల్‌ వస్తున్నారంటే తెరాసకు భయం పట్టుకుంది

– అందుకనే అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు

-కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు11(జ‌నం సాక్షి) : ఓయూలో తెర వెనుక ఉన్నది మొత్తం తెరాస నాయకులే అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం పొంగులేటి విూడియాతో మాట్లాడుతూ… తెరాస ఎంపీలు కేవలం రక్షణ శాఖ భూములు మాత్రమే అడిగారు కాని విభజన హావిూల విూద మాట్లాడలేదన్నారు. విభజన హావిూలపై పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ జరిగితే ఆంధ్ర వాళ్ళు మాత్రమే వెళ్లారని పేర్కొన్నారు. పోలవరం ముంపు గ్రామాల విూద కనీసం మాట్లాడలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉన్నప్పుడు కేవలం విూ రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యల విూద అడగరా అని పొంగులేటి ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ పర్యటనకు ఓయూలో పర్మిషన్‌ ఇవ్వరా.. ఇదా విూ ప్రజాస్వామ్యం అని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాహుల్‌ అంటే భయమని, పీఠాలు కదులుతున్నాయని భయపడుతున్నారని పొంగులేటి ఎద్దేవా చేశారు. ఓయూలో తెర వెనుక ఉన్నది మొత్తం తెరాస నాయకులే అని ఆరోపించారు. తెలంగాణ సమాజంలో విూ కుటిల నీతిని ఎండగడుతాం అని పొంగులేటి స్పష్టం చేశారు.