ఓసిపి త్రీ యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించాలి
యైటింక్లయిన్ కాలని జనవరి 05 (జనం సాక్షి):
ఓసిపి త్రీ లో పలు సమస్యలు పేరుకుపోయాయని కృషి భవన్ సందర్శించిన సందర్భంగా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు అయిలి శ్రీనివాస్ కు కార్మికులు పలు సమస్యలను విన్నవించడం జరిగింది. బంపర్ లకు సంబంధించిన సీట్ క్యూస్షన్స్ చెడిపోయి, బంపర్ జెకె టైర్స్ వేయడం వల్ల ఎక్కువ కుదుపులకు లోనైతుందని దాని వలన కార్మికులకు నడుము నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. ఓబి సైడ్ ఎక్కువగా బోల్డర్స్ రావడం వల్ల లోడింగ్ మరియు డంపింగ్ కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అదే రకంగా డ్యూటీలో ఉన్న వ్యక్తులకు విచ్చలవిడిగా సంబంధం లేని వ్యక్తులకు వార్నింగ్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుందని కార్మికులు తీవ్ర మనోవెదనకు గురవుతున్నామని విన్నవించారు. ఈ సందర్భంగా గని మేనేజర్ ను కలిసి శ్రీనివాస్ సమస్యలను మేనేజర్ దృష్టికి తీసుకెళ్లి ఇటువంటి చర్యల మానుకోకుంటే కార్మికుల పక్షాన ఆందోళన నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వెంటనే లెటర్స్ జారీ చేసే కార్యక్రమాన్ని విరమించుకొని సీట్, టైర్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓసీపీ -3 ఫిట్ కార్యదర్శి కొంగర రవీందర్, నరసయ్య, గట్టయ్య, తిరుపతి, రవీందర్ రెడ్డి, నరేష్ ,ఓదేలు, రాజ సమ్మయ్య, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు
ఓసిపి త్రీ యాజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కరించాలి




