మహా సమ్మేళనంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి
హుజూర్ నగర్ జనవరి 05(జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో బూత్ శక్తి కేంద్రాల సమావేశం మండల అధ్యక్షులు కుందురు కోటి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా అసెంబ్లీ పాలక్ దాసరి మల్లేశం, ప్రభారీ కర్నాటి దనుంజయ, అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పార్టీని బూత్ స్థాయి నుంచే బలోపేతం చేయాలని ఈ నెల 7వ తేదీ శనివారం జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వర్చువల్ గా నిర్వహించే నియోజకవర్గాల బూత్ మహా సమ్మేళనం లో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ టౌన్ అధ్యక్షులు ముసుకుల చంద్రారెడ్డి, గంథం సతీష్, మాడుగుల లక్ష్మీనారాయణ, గంగసాని నారపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, రేగ్గాల శ్రీనివాస్, మంద వెంకటేశ్వర్లు, గండు శ్రీను, ప్రేమనదం, అన్నెం మోహన్ రెడ్డి, మంద శ్రీకాంత్, సింగతల రామంజి రెడ్డి, మైసయ్య, గుండా గోపి, రాములు, ఉమామేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
మహా సమ్మేళనంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి




