కనిపిస్తే యజమానులపై కఠిన చర్యలు: పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్,జూన్12(జనం సాక్షి ): ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పైకి పశువులను తీసుకువస్తే కఠిన చర్యలు తప్పవని సైబరాబాద్ పోలీసులు మంగళవారం హెచ్చరించారు. ఔటర్ రింగ్ రోడ్డుపైకి పశువులను తీసుకురావద్దని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పశువుల కాపరులపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ వెల్లడించారు. ఓఆర్‌ఆర్‌పై తిరిగే పశువుల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఔటర్‌పై పశువులు కనిపిస్తే 9490617444, 8500411111 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు. వేగంగా వస్తున్న వాహనాలకు అకస్మాత్తుగా పశువులు అడ్డురావడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.




