Thursday, 5 November 2026

అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం

ఫిక్కీ సదస్సు ఈటెల వెల్లడి

హైదరాబాద్‌,జూన్‌12(జ‌నం సాక్షి ): చట్టాలను నూటికి నూరు శాతం అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. పేకాట క్లబ్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. అలాగే గుడాంబ సరఫరా లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది కుటుంబాలను నాశనం చేసిన గుడుంబాను నిషేధించామన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో ఫిక్కీ ఆధ్వర్యంలో నకిలీలు, స్మగ్లింగ్‌పై పోరాటం- ఆర్థిక అభివృద్ధి వేగవంతం చేయడం అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఈటల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అసాంఘిక కార్యకాలపాలకు తావు లేకుఏండా చేఇన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ఇలాంటి వాటిపై ఉక్కుపాదం మోపామని అన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. సంస్కరణలకు తెలంగాణ గొప్ప కేంద్రం కాబోతుందని అన్నారు. నకిలీలపై ఎలాంటి సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటాం.వినియోగదారులను చైతన్యపరచాల్సిన అవసరముందని తెలిపారు. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేయాలన్నారు.