ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి
శివ్వంపేట జూన్ 27 జనంసాక్షి : ఔర్ ఏక్ దక్క తెలంగాణలో కాంగ్రెస్ అధికారం పక్క అనీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన శివ్వంపేట మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులతో కలిసి సీతారం తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నాయకులతో కలిసి స్థానికంగా ఉన్న ఎల్లమ్మ, దుర్గమ్మ దేవాలయాలను సందర్శించి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు గ్రామంలో నిర్వహించిన బోనాల జాతరకు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయాల అభివృద్ధికి కోసం తన సొంత డబ్బులు 15 వేల రూపాయల నగదును ఆలయాల నిర్వాహకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు చెన్నాపూర్ రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు భానోత్ రాజు, రవీందర్, వెంకటేష్, తుకారం, రవి, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఔర్ ఏక్ దక్క కాంగ్రెస్ అధికారం పక్క




