
– కౌలు రైతుల,ప్రజా సంఘాల డిమాండ్.
గద్వాల నడిగడ్డ, జూన్ 27 (జరం సాక్షి);
తెలంగాణా రాష్ట్రంలో 20 లక్షల కౌలు రైతు కుటుంబాలు అత్యంత సంక్షోభంలో ఉన్నాయని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు కన్నెగంటి రవి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలోని టీఎన్జీవోనంలో మంగళవారము కౌలు రైతుల వేదన విందాం రండి అనే పేరున తెలంగాణ రైతాంగ సమితి, రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో గద్వాలలో జరిగిన పబ్లిక్ హియరింగ్ లో ఆయన ప్రధాన వక్తగా
.మాట్లాడారు.
రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు వివిధ జిల్లాలలో కౌలు రైతుల పబ్లిక్ హియరింగ్ లు జరుగుతున్నాయి.
కన్నెగంటి రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో 1950, 2011 కౌలు రైతుల చట్టాలు ఉన్నా ప్రభుత్వాలు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు.
కౌలు రైతులను గుర్తించక పోవడం,కౌలు రైతులకు రైతు బంధు,రైతు బీమా పథకాల ను అమలు చేయక పోవడం.పంటల బీమా ,రైతు బీమా పథకాలనుఅమలు చేయకపోవడం,ప్రకృతి వైపరీత్యాలకు నష్ట పరిహారం చెల్లించక పోవడం వల్ల ,పంటను కౌలు రైతు పేరుతో కొనకపోవడంవల్ల కౌలు రైతులు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ కార్యక్రమానికి రైతాంగ సమితి జిల్లా అధ్యక్షులు ఖాజా అధ్యక్షత వహించారు.
సమావేశంలో జిల్లా నలుమూలల నుండీ వచ్చిన కౌలు రైతులు మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తంచేశారు.కౌలు రేట్లు,పంటల ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోతూ కౌలు రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారనీ, కౌలు రైతులు భయంతో బతుకుతున్నారనీ వారు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమను గుర్తించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.
కౌలు రైతులకు కూడా రైతు బంధు సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో రైతాంగ సమితి నాయకులు జక్కుల వెంకటయ్య, జీ.గోపాల్, సత్తి రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక నాయకులు నవీన్ , పాలమూరు అధ్యయన వేదిక నాయకులు ఇక్బాల్ పాషా, చైతన్య మహిళా సంఘం నాయకులు రేవతి, సి పి ఐ నాయకులు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు జలీల్,తదితరులు పాల్గొని మాట్లాడారు.




