Wednesday, 4 November 2026

కంకోల్ లో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం

మునిపల్లి, మే 22, జనంసాక్షి : కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షా అని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం నాడు మండలంలోని కంకోల్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో మునిపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కంకోల్ లో అంబేద్కర్ విగ్రహాకి పూలమాల వేసి నివాళులు అర్పించారు. స్థానిక మండల నాయకులు భారీ గజమాలతో ఎమ్మెల్యేను సత్కరించి పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. సమావేశం ప్రారంభానికి ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల మీద ఫైర్ అయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం భూసేకరణ చేస్తే దామోదర్ తన అనుచరులతో కేసులు వేయించి అడ్డుకున్నారన్నారు. అయితే తాను మంత్రి హరీష్ రావు, కేటీఆర్ తో మాట్లాడి రైతులకు ఒక్కరికి రూ. 15 లక్షలు పరిహారం ఇప్పించానని తెలిపారు. వట్ పల్లి మార్కెట్, జేఎన్టీయూ యూనివర్సిటీ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎంత పరిహారం ఇచ్చారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో దామోదర్ రాజానర్సింహాకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గతంలో సింగూర్ ప్రాజెక్టు నీళ్లు మన ప్రాంత రైతులకు రాకుండే.. ఇప్పుడు మన ప్రాంత రైతులకు సాగు నీళ్లు అందుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో చెరువులు నింపుకున్నామని తెలిపారు. మండలంలోని చెరువుల పూడికతీసి నింపుకున్నామని చెప్పారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. కార్యకర్తలే తన బాలమని, కార్యకర్తల ధైర్యంతోనే తాను ముందుకు సాగుతున్నానని చెప్పారు. జడ్పీటీసీ మీనాక్షి, ఎంపీపీ శైలజా, వైస్ ఎంపీపీ బాబా పాటిల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, మఠం బిక్షపతి, పైతర సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి మంతురి శశికుమార్, రామచంద్ర రావు, యూత్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు, మాజీ ఎంపీపీ చంద్రయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.