Wednesday, 4 November 2026

వరంగల్ లో  సి .ఎమ్  కప్ 2023 ప్రారంభం

 

 

 

 

 

వరంగల్ బ్యూరో, మే 22 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని సిటీ  స్టేడియం లో  జిల్లా స్థాయి ముఖ్యమంత్రి కప్ 2023 క్రీడా కార్యక్రమాలు సోమవారం  ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను నగర  మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, జడ్పీ ఛైర్  పర్సన్  గండ్ర  జ్యోతి,   తూర్పు శాసనసభ్యులు నన్నపునేని  నరేందర్, ఎం ఎల్ సి బస్వరాజు  సారయ్య, అదనపు  కలెక్టర్ అశ్విని తానాజీ  వాకాడే  వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా మొదలైన వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు అలాగే జాతీయస్థాయి క్రీడాకారుల చేత క్రీడాజ్యోతిని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డి సి పి ఎంఏ భారీ,  జిల్లా క్రీడా అధికారిని ఇందిరా తో పాటు పలువురు పాల్గొన్నారు