Thursday, 5 November 2026

కంటివెలుగుతో పేదల కళ్ళల్లో ఆనందం.

– బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్.

బెల్లంపల్లి, జనవరి 19, (జనంసాక్షి )
కంటివెలుగు కార్యక్రమంతో పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన మండలంలోని తాళ్ల గురిజాల గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని, రాష్ట్ర ప్రజల కంటి చూపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటివెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని అన్నారు. పేదప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేదప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రంజిత-వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ శకుంతల-వెంకటేష్, వార్డుసభ్యులు, లంబడితండా సర్పంచ్ రాయమల్లు, మండల బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషా, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆరెస్ నాయకులు, మండల ప్రత్యేకాధికారి దుర్గాప్రసాద్, ఎంపీడీఓ రాజేందర్, ఎంపీఓ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు లక్ష్మీ, కార్తిక్, తాళ్లగురిజాల ఎస్సై రాజశేఖర్, ఏఎస్సై రాజన్న, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల, ఆప్టోమెట్రిస్ట్ పరమేశ్వరి, సూపర్ వైజర్ సమ్మయ్య, ఏఎన్ఎంలు ఉమారాణి, చంద్రకళ, పద్మ, ఆశాకార్యకర్తలు సుగుణ, యశోద, రాజేశ్వరి, లక్ష్మీ, స్వర్ణలత, ఇతర అధికారులు, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు …