Thursday, 5 November 2026

దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయండి.

-డిసిసి అధ్యక్షులు భారత్ చంద్ రెడ్డి,
-ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రజినీకాంత్.

కురవి జనవరి18: జనం సాక్షి న్యూస్:టిపిసిసి ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నగరిగారి ప్రీతం,టిపిసిసి రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాలతో నాగర్ కర్నూల్ లో జరుగబోయే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మహబూబాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులు జెన్నారెడ్డి భారత్ చంద్ రెడ్డి కోరారు. దీనిని పురస్కరించుకొని బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోసభ యొక్క వాల్ పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ ఎస్సీ భాగం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రజినీకాంత్ ఆధ్వర్యంలో డిసిసి అధ్యక్షుడు జెన్నారెడ్డి భారత్ చంద్ రెడ్డి చేతులమీదుగా వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో దళిత గిరిజన బహుజనులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నాగర్ కర్నూల్ లో సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని,మహబూబాబాద్ జిల్లాలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సభకు హాజరు కావాలని,అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా,మండల,గ్రామ నాయకులు సభకు హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కన్వీనర్ దబ్బేటి రమేష్,రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్,రాష్ట్ర మహిళా కన్వీనర్ కురాకుల భారతి,కౌన్సిలర్లు రవి,పోతరాజు,కెకెసి జిల్లా అధ్యక్షుడు సల్వాది దిలీప్ ,టౌన్ యూత్ ప్రెసిడెంట్ పుప్పాల కమలేందర్,యూత్ నాయకులు జిలుగుల భాస్కర్,కోర్ని అనిల్,నాలమాస వెంకన్న,ఈదురు సైదులు,జమీల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.