– బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్.
బెల్లంపల్లి, జనవరి 19, (జనంసాక్షి )
కంటివెలుగు కార్యక్రమాన్ని బెల్లంపల్లి పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం ఆమె బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డు శిశు మందిర్ పాఠశాలలో కంటివెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. 1వ వార్డు కన్నాల బస్తీ ప్రభుత్వ పాఠశాలలో వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమము 100 రోజుల ఉంటుందని, బెల్లంపల్లి పట్టణ ప్రజలు అందరు కంటివెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా కంటివెలుగు ద్వారా ఉచిత పరీక్షలు, మందులు, కళ్ళజోళ్ళు, అవసరం అయిన వారికి శాస్త్ర చికిత్స చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ ఆకుల వెంకటేష్, 1వ వార్డు కౌన్సిలర్ సూరం సంగీత బాణేష్, 18వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గురుండ్ల లక్ష్మి శివకృష్ణ, కౌన్సిలర్లు, స్టేట్ నోడెల్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిప్యూటీ డిఎమ్ఎచ్ఓ విజయ పూర్ణిమ, స్పెషల్ ఆఫీసర్ దుర్గ ప్రసాద్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, రెవెన్యూ ఆఫీసర్ భుజంగా రావు, ఏ ఈ సందీప్, టిఓ ఆశ్రిత్, డాక్టర్లు సౌజన్య, అలేఖ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యలు , మెడికల్ సిబ్బంది, సెంటర్ సూపర్వైజర్లు, మునిసిపల్ సిబ్బంది, మెప్మాసిబ్బంది పాల్గొన్నారు.
కంటివెలుగు సద్వినియోగం చేసుకోండి.




