Thursday, 5 November 2026

కంటి వెలుగుతో పేదల కళ్ళల్లో ఆనందం – ఎమ్మెల్యే కిశోర్ కుమార్

 

మోత్కూరు జనవరి 19 జనంసాక్షి : కంటివెలుగు కార్యక్రమంతో పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని తుంగతుర్తి శాసన సభ్యులు కిశోర్ కుమార్ అన్నారు. గురువారం ఆయన మున్సిపాలిటీ కేంద్రంలోని కంటివెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేదప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని, రాష్ట్ర ప్రజల కంటి చూపు కోసం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదప్రజల కంటి పరీక్షల కోసం కంటివెలుగు అనే కార్యక్రమాన్ని అమలుచేసి కంటి పరీక్షలను పూర్తిగా ఉచితంగా చేస్తున్నారని అన్నారు. పేదప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనునిత్యం పరితపించే ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉండడం తెలంగాణ రాష్ట్ర ప్రజల అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పేదప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణ రెడ్డి, ఎంపీపీ రచ్చ కల్పన, జెడ్పీటీసి గొరుపల్లి శారద సంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిపిరెడ్డి సావిత్రి మేఘా రెడ్డి,వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నరసింహ రెడ్డి,వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మి మారయ్య,మాజి మార్కెట్ చైర్మన్ చిప్పలపల్లి మహేందర్, మున్సిపాలిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్ బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి,మండల పార్టీ అధ్యక్షుడు పోన్నేబోయిన రమేష్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు పానుగుల విష్ణు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు,మోత్కూరు మండల స్పెషల్ ఆఫీసర్ యాదయ్య, మోత్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, అధికారులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.