Thursday, 5 November 2026

కంటి జబ్బులను నిర్లక్ష్యం చేయొద్దు: కెటిఆర్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): కంటివెలుగు కార్యక్రమం పేదలకు వరం లాంటిదని మంత్రి కేటిఆర్‌అన్నారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్య సౌకర్యకం కల్పించాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం ముందుకు పోతున్నదని, దీనిలో భాగంగానే సీఎం కంటివెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. మనిషి శరీరంలో కళ్లు అత్యం ప్రాదాన్యత కలిగినదని, కాని దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామని, ఇలాంటి పరిస్ధితుల్లో కంటి ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించి మరీ ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ప్రతి పేద వానికి కంటి చూపు కల్పించాలనే బృహత్తరమైన కార్యక్రమాన్ని ప్రజల ముంగిటకు తీసుకువచ్చారని, దీన్ని ప్రేద ప్రజలంతా కూడా సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వచ్చి మరీ కంటి పరీక్షల స్లిప్స్‌ను అందజేస్తారని అయన తెలిపారు. కంటి అద్దాలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.చందానగర్‌ పీజేఆర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. కంటి పరీక్షకు వచ్చిన స్థానికులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం హఫీజ్‌పేటలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని సందర్శించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.