Thursday, 5 November 2026

కంటి వెలుగుకు స్పందన లభించిందని ఎంపీపీ ధశరథ్ రెడ్డి అన్నారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండలం కేంద్రంలో గల ప్రాథమిక పాఠశాలలో కంటి వెలుగు పరిక్షల కోసం అన్ని ఏర్పాట్లను పరిశీలించడం జరిగింద న్నారు. అనంతరం అన్నారం ఆరోగ్య కేంద్రంలో కంటి వెలుగు పరీక్షల కోసం అన్ని రకాల సదుపా యాలు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకు న్నామని అన్నారు. అన్ని రకాల మందుగొలిలు ,కంటి చుక్కల మందులను అందుబాటులో ఉంచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని అందులో భాగమే రెండవ విడత కంటి వెలుగు అని అన్నారు మండలంలో రెండు గ్రామా ల్లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలు అందరూ కంటి పరీక్షలు చేసుకోవాలని కోరారు. అవసరమైతే కంటి అద్దాలు అందజేస్తార ని అని అన్నారు. అనంతరం జడ్పీటీసీ నారెడ్డి మోహన్ రెడ్డి కంటి పరీక్షల కేంద్రాన్ని పరీశీలించా రు. అనంతరం వారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు పరీక్షలను నిరంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉఃచుతూ , అన్ని రకాల వైద్య సదుపాయాలను అందుబాటు లో ఉంచి తమ ఉన్నత రాజకీయన్ని చాటుకోవాల ని అన్నారు. ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించినపుడే అంబేద్కర్ కలలు కన్నా రాజ్యం చూస్తామన్నారు. రాజకీయ స్వలాభం కోసం కంటివెలుగు కార్యక్రమం పెట్టి కేవలం రాజకీయ ఉనికిని చాటెందుకు అధికార ప్రభుత్వం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం అధనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే కంటివెలుగు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతు లు కంటి పరీక్ష కేంద్రలలో కల్పించాలని అన్నారు. లేని ఎడల సంబదీత అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విడతల వారిగా అన్ని గ్రామాల్లో కంటివెలుగు సెంటర్లు నిర్వహిస్తా రని అన్నారు. ఈ కార్యక్రమం లో వెంట ఎంపిడివో విజయ్ కుమార్, తహశీల్దార్ ఆనంద్ కుమార్, ఎంపీటీసీ లు, ఎంపీవో సవిత ,వివిధ గ్రామల సర్పంచ్లు, కార్యదర్శులు, ఆరోగ్య సిబంద్ధి, తదితరులు పాల్గొన్నారు