బిచ్కుంద జనవరి 17 (జనంసాక్షి) శేఖపూర్ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని జిల్లా భాజపా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. గడప గడపకు భాజపా ఇంటింటికి అరుణ తార గల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలంలో గల శేఖపూర్ గ్రామంలో మంగళవారం నాడు గడప గడపకు భాజపా జిల్లా అధ్యక్షురాలు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న నిధులు, అభివృద్ధి పథకాలు వివరించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగట్లేవని, గ్రామంలో సీసీ రోడ్డు వ్యవస్థ, మురికి కాలువల వ్యవస్థ కుంటుపడిందని వాపోయారు. రాబోయే ఎన్నికల్లో తనకు గెలిపించాలని, తాను చేసిన అభివృద్ధే కనబడుతోందని తెలియజేశారు. తాను గెలిచాక మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి వీరేశం, హన్మండ్లు, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి అరుణ్ పటేల్, డోంగ్లి ధనంజయ పటేల్ మరియు భాజపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
శేఖపూర్ గ్రామంలో అభివృద్ధి శూన్యం మాజీ ఎమ్మెల్యే అరుణ తార




