Thursday, 5 November 2026

కంటి వెలుగుకు స్పందన లభించిందని .. ఎంపీపీ మంజుల. జడ్పిటిసి మేఘమాల

 

 

 

జనం సాక్షి / కొల్చారం మండలం సీతారాంపూర్ తండాలో తుక్కాపూర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జెడ్పిటిసి మేఘమాల సంతోష్ కుమార్, ఎంపీపీ మంజుల కాశీనాథ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి వారు తెలిపారు. ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేయించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని వారు తెలిపారు ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి రమేష్ తో పాటు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు