బెల్లంపల్లి, జనవరి 19, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం లోని శాంతిఖని భూగర్భ గనిలో గురువారం మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ పర్యటించారు. మొదటగా ఆయన భూగర్భ గనిలో నడుస్తున్న బోల్టర్ మైనర్ పని స్థలాలను పర్యవేక్షించి మరియు బోల్టర్ మైనర్ భవిష్యత్ కార్యాచరణపై గని అధికారులకు సూచనలు చేశారు. రక్షణతో కూడిన ఉత్పత్తి కొరకు ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు పాటిస్తూ పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గని ప్రాజెక్టు అధికారి ఆర్ విజయ ప్రసాద్, యాక్టింగ్ మేనేజర్ పి రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, బీఎం ఇంచార్జి ముస్తఫా, అధికారులు పాల్గొన్నారు.
శాంతిఖని గనిని పర్యవేక్షించిన మందమర్రి ఏరియా జీఎం




