Thursday, 5 November 2026

తోటి క్లాస్మేట్ ఆరోగ్యానికి ఆర్థిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు

 

రుద్రంగి జనవరి 19 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో 1991-92 లో పదవ తరగతి చదివిన మరిపెళ్లి మహేందర్ అనారోగ్యంతో (పెరాలసిస్) కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఆయన ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కలిసి చదువుకున్న తోటి స్నేహితులు మరియు తమ గురువు రఘు కిషోర్ తో కలిసి 92,000 రూపాయలు విరాళాలను సేకరించి గురువారం మహేందర్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా క్లాస్మేట్స్ మాట్లాడుతూ… తనతో పాటు చదివిన తోటి మిత్రుడు మహేందర్ గౌడ్ వృత్తి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నా సమయంలో హఠాత్తుగా పక్షవాతం వచ్చింది.అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఆయన కొంత కాలం విదేశాలకు వెళ్లిన ఎలాంటి ప్రయోజనం కలగకపోవడంతో తాను వృత్తిరీత్యా గౌడ్ అయినందున ఇటీవలే విదేశానికి తిరిగి వచ్చి వృత్తి పని చేసుకుంటున్నా తరుణంలో పక్షవాతం రావడం బాధాకరమన్నారు. ఎంతో కొంత చేయూత నందించాలనే దృక్పథంతో తోటి క్లాస్మేట్స్ మరియు గురువైన రఘు కిషోర్ తో కలిసి ఇట్టి ఆర్థిక సహాయాన్ని మహేందర్ కు అందించినట్లు తెలిపారు.మహేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలిపారు.