తూప్రాన్, ఏప్రిల్ 17 ( జనం సాక్షి) :: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అష్టపూర్ సర్పంచ్ పిట్ల పోచయ్య తెలిపారు
తూప్రాన్ మండలంలోని కిష్టాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. గ్రామ సర్పంచ్ పిట్ల పోచయ్య ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న రీతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం దిగ్విజయం దిశగా వెళుతుందని పేర్కొంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజల అంధత్వాన్ని నివారించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాడని దేశంలో ఎక్కడా లేనివిధంగా కంటి వెలుగు కార్యక్రమాలను చేపట్టాడని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కంటి లోపాలున్న వృద్ధులు మధ్య వయస్సు గలవారు కంటి ఇబ్బందులు ఉన్నవారు కంటి వెలుగులో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకొని అద్దాలను మందులను తీసుకోవాలని కంటి లోపాలు ఎక్కువ ఉన్నవారు ఆపరేషన్ ద్వారా నయం చేసుకోవాలని సూచిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల అందత్వాన్ని నివారించే దిశగా కంటి వెలుగు కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి చేపట్టడం జరిగిందని వారి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కిష్టారెడ్డి, మల్లారెడ్డి, ఎండి అహ్మద్, ఎంపీటీసీ సంతోష్ రెడ్డి, ఉపసర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామ ప్రజలు, వృద్ధులు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




