ఆంp జనం సాక్షి జోగుపేట ఆందోల్ లోని లక్ష్మీనరసింహ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిచెక్కులను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డిఆధ్వర్యంలో సోమవారం ఆయా మండలాల సంబంధించిన ఆందోల్ మండలం కి 252 చెక్కులను పుల్కల్ మండలానికి 27 చౌటాపూర్ మండలానికి 57 టేక్మల్ మండలానికి 39 చెక్కులను ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధించిన ఆందోల్ మండలం ఎంపీపీ బాలయ్య జడ్పిటిసిలు ఎంపీటీసీలు సర్పంచ్లు లు తదితరులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డిబి నాగభూషణం ఆందోల్ జోగుపేట మున్సిపల్ కౌన్సిలర్లు నాలుగు మండలాలకు సంబంధించిన తాసిల్దార్లు బి ఆర్ఎస్ కార్యకర్తలు లబ్ధిదారులుపాల్గొన్నారు.




