Thursday, 5 November 2026

కంటి వెలుగును విజయవంతం చేయాలి జడ్పీటీసీ స్వప్నభాస్కర్

కంటి వెలుగును విజయవంతం చేయాలి జడ్పీటీసీ స్వప్నభాస్కర్
జహీరాబాద్ జనవరి 11 (జనం సాక్షి) కంటి వెలుగు’ కార్యక్రమంను విజయవంతం చేయాలని జడ్పీటీసీ స్వప్నభాస్కర్ అన్నారు. బుధవారం న్యాల్కల్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ ‘కంటి వెలుగు’ కార్యక్రమం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు..ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక సంక్షేమ పథకాలతో పాటు,అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారు 200 కోట్ల రూపాయలు వెచ్చించి,రాష్ట్రములోని ప్రతి పట్టణాన్ని,గ్రామాన్ని ‘అందత్వ రహిత’ తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజమ్మ,వైస్ ఎంపీపీ గౌసొద్దీన్,ఎంపీడీఓ వెంకట్ రెడ్డి,ఎంపీవో సురేష్, డా,,శ్వేతాప్రియా, వివిధ గ్రామాల ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ సెక్రటరీ లు,అంగన్వాడీ సూపర్వైజర్లు,తదితరులు పాల్గొన్నారు.