పదవ తరగతి పరీక్షలో చాయిస్ ప్రశ్నలు పెంచాలి
జహీరాబాద్ జనవరి 11 (జనం సాక్షి)పదవ తరగతి పరీక్షలో చాయిస్ ప్రశ్నలు పెంచాలి అని
ఎస్ఎఫ్ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి టీ రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారంజహీరాబాద్ మండల కేంద్రం లో ఎంఇఓ బస్వరాజు కు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఏరియా కార్యదర్శి టీ రాజేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ పరీక్షలలో మొదటిసారిగా పబ్లిక్ పరిక్షలు రాస్తున్న విద్యార్థులను మానసిక ఒత్తిడికి దూరం చేసే విధంగా టెన్త్ క్వశ్చన్ పేపర్లలో 30% చాయిస్ ప్రశ్నలుపెంచాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది అన్నారు..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న పదవ తరగతి పరీక్షలు లో పేపర్లను కుదించి 6 పేపర్లు చేయడం ఆహ్వానించదగ్గ విషయం కానీ ఆబెక్టీవ్ ప్రశ్నలు 2 మార్కుల 3 మార్కుల ప్రశ్నలకు ఏలాంటి ఛాయిస్ ఇవ్వలేదు అన్నారు.వ్యాసరూప ప్రశ్నలు కూడా ఇచ్చిన సమయంలో అన్ని రాయాలని పెట్టారు అన్నారుఈ పద్దతి వల్లన సిలబస్ మొత్తం ఒకే పేపర్ లో విద్యార్ధులు రాయాలని సమయం సరిపోదు అన్నారు. ఇలా చేయడం మూలంగా విద్యార్ధులు పరీక్ష అంటే కఠినంగా ఉంటుందని ఒత్తిడి గురైయే అవకాశం ఉందన్నారు.ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులంతా కరోనా సమయంలో ఆన్ లైన్ లో సరిగ్గా డిజిటల్ విద్య అందుబాటులో లేని సమయంలో చదువుకోవడం మూలంగా సరైన అభ్యాసన లేని వారు. ఈ పరిస్థితి దృష్ట్యా కనీసం ఛాయిస్ లేకుండా చేస్తే విద్యార్ధులు నష్ట పోతారు అన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నాయకులు ఉపాధ్యక్షులు మల్లేష్. చంద్రవర్ధన్. ముజసిరాలి తదితరులు పాల్గొన్నారు
పదవ తరగతి పరీక్షలో చాయిస్ ప్రశ్నలు పెంచాలి




