ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జనంసాక్షి/హసన్ పర్తి,జనవరి11: హాసన్ పర్తి మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బుర్ర రాజమొగిలి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ఎమ్మెల్యే దృషికి రావడంతో వారికీ ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా 2లక్ష 50వేల రూపాయల LOCని హన్మకొండ ప్రశాంత్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు. ఆరోగ్య శ్రీ లో వర్తించని వ్యాధులకు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు వైద్యానికి అయ్యే ఖర్చులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఆంచూరి విజయ్ కుమార్, ఎంపీటీసీ ఆకుల ఇంద్రయ్య, గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర రాజు, మండల సోషల్ మీడియా ప్రెసిడెంట్ తుమ్మల రాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ముఖ్యమంత్రి సహాయనిధి అందజేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేష్




