Wednesday, 4 November 2026

కంటి వెలుగును సద్వినియోగం చేసుకునే లా చూడాలి

కంటి వెలుగును సద్వినియోగం చేసుకునే లా చూడాలి
రాజోలి 06 జనవరి (జనం సాక్షి)
కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూసే బాధ్యత ప్రతి అధికారి తీసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్రం రాజోలి లో శుక్రవారం కంటి వెలుగు కార్యక్రమం పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 18 నుండి జరిగే కంటి వెలుగు కార్యక్రమంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని, ఎలాంటి ప్రణాళికలు రూపొందించారని అడిగారు. గ్రామాల వారిగా ప్రజలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకునే బాధ్యత ను సర్పంచ్ ఎంపీటీసీ లు తీసుకోవాలని అన్నారు. గతంలో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో ఎంతో మంది కంటి సమస్యలు ఉన్న వారు వారి సమస్యలు పరిష్కారం చేసుకున్నారని రానున్న కార్యక్రమంలో కూడా నేత్ర సమస్యలు తీర్చి వారికి అద్దాలు అందచేయటం జరుగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుగుణమ్మ,ఎంపిడిఒ గోవింద్ రావ్,ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీ లు పాల్గొన్నారు