దత్తగిరి ఆశ్రమం ఆవరణలో ఉచిత వైద్య శిబిరం
ఝరాసంగం ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్ అన్నారు. శుక్రవారం ఆశ్రమం ఆవరణలో జహీరాబాద్ లోని సత్య శ్రీ పాలి క్లినిక్ అండ్ యోధ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులకు అభినందించారు. ఇలాంటి సేవ కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. శిబిరంలో బర్దిపూర్ గ్రామంతో పాటు ఆయా గ్రామాల ప్రజలు ఈ శిబిరం లో పాల్గొని పరీక్షలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వహకులు ఈశ్వర్ పాటిల్ వైద్యులు డాక్టర్ హరీష్,కుమార్,డాక్టర్, పెంటోజీ ఆనంద్ మైపాల్ సర్పంచ్ శివలక్ష్మి కృష్ణ,సిబ్బంది రాయికోటి నర్సిములు శ్యామెల్, ఆనంద్, కావేరి, మహేష్ , గోపాల్, తదితరులు పాల్గొన్నారు.




