Wednesday, 4 November 2026

నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి వెళ్ళిన సిపిఐ శ్రేణులు

నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి వెళ్ళిన సిపిఐ శ్రేణులు

టేకులపల్లి, జనవరి 6( జనం సాక్షి): ఇల్లందు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశానికి టేకులపల్లి మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మోటార్ సైకిల్ ర్యాలీతో స్థానిక సిపిఐ శ్రేణులు వెళ్లారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్కే షాబీర్ పాష పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు రామచందర్ ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం నుండి బైక్ ర్యాలీతో వెళ్లి ఆ సమావేశంలో సాంబశివరావుని ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో సిపిఐ పార్టీ కలిసివచ్చే పార్టీలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మండల నాయకులు ఎజు భాస్కర్, బండి వీరభద్రం, టి లక్ష్మణ్, చింత కన్నయ్య, రవీందర్, మధు, సతీష్,రాజు,శివ,కోటి, జయమ్మ, భారతి, నరేందర్,చంటి తదితరులు పాల్గొన్నారు.