మల్దకల్ జనవరి 16 (జనంసాక్షి)జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంనీలిపల్లి,మల్దకల్ గ్రామాలలో గ్రామపంచాయతీ,రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేస్తున్న కంటి వెలుగు శిబిరాలను ఎంపీడీవో కృష్ణయ్య సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.ఈనెల 18 వతారీకు నుండి 27 తారీకు వరకు ఉచిత కంటి వెలుగు శిబిరంనిర్వహిస్తారు.నీలిపల్లి పాఠశాలలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నది,పాఠశాలలో కరెంటు ,టాయిలెట్స్ గదులు, టేబుల్స్,కుర్చీలు,నీటి సౌకర్యం అందుబాటులో ఉంచాలని గ్రామ సర్పంచ్ ప్రకాష్, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.ప్రతిరోజు 150 మందికి ఉచిత కంటి పరీక్షలు శిబిరం నిర్వహించడం జరుగుతుంది.కంటి పరీక్షలకు అందరూ వచ్చే విధంగా ప్రజలకు టామ్ టామ్ ద్వారా కరపత్రాల ద్వారా ఫ్లెక్సీల ద్వారా తెలిపి విజయవంతం చేయాలని సూచించారు. మల్దకల్ రైతు వేదిక నందు ఈనెల 18వ తారీకు నుండి ఫిబ్రవరి 27 వరకు ఉచిత కంటి పరీక్ష శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది.రైతు వేదికలో అన్ని సదుపాయాలు ఉండేటట్లు చూడాలని పంచాయతీ కార్యదర్శు, సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో నీలిపల్లి సర్పంచ్ ప్రకాష్,ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శి శుభావతి,మల్దకల్ సర్పంచ్ యాకోబు,పంచాయతీ కార్యదర్శి మాబీ,అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.




