Thursday, 5 November 2026

ధర్మపురి ఆలయాన్ని దర్శించుకున్న కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

..

 

ధర్మపురి ( జనం సాక్షి) ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంనకు కోరుట్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల విద్యాసాగరరావు శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు.
ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగా స్వాగతం పలికి అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యుడు ఇందారపు రామయ్య , కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేష వస్త్రం ప్రసాదం ఇచ్చి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం పండితులు బొజ్జ రమేష్ శర్మ ముఖ్య అర్చకులు రమణయ్య, రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్ ,ఇనగంటి రమ వెంకటేశ్వరరావు,గుంపుల రమేష్ , గునిశెట్టి రవీందర్,మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.