Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమంతో అందరికీ మేలు – కంటి వెలుగు విజయవంతానికై ఇంటింటి ప్రచారం

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా హుజూర్ న లోని గోవిందపురం నందు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం విజయవంతనికై
8వ వార్డు కౌన్సిలర్ చిలక బత్తిని సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శనివారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమంతో అందరికీ మేలు కలుగుతుందని అవగాహన కల్పించి ముందస్తు ప్రణాళిక తో విజయవం తానికి కృషి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ సూపర్వైజర్ ఇందిరాల రామకృష్ణ, సావిత్రి, శ్రీదేవి, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.