జూపల్లికొల్లాపూర్ రూరల్ జనం సాక్షి ఫిబ్రవరి.11రైతుల సంక్షేమమే ధ్యేయంగా సింగోటం గోపాల్ దీన్నే లింక్ కెనాల్ ను సాంక్షన్ చేయించా మాజీ మంత్రి జూపల్లికొల్లాపూర్ మండలం సింగోటం,యన్మన్ బెట్ల గ్రామాలలో ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్న మాజీమంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గతంలో తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు నియోజకవర్గ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని సింగోటం రిజర్వాయర్(శ్రీవారి సముద్రం) పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి వచ్చేలా చేశానని జూపల్లి అన్నారు.ఈరోజు ఉదయం కొల్లాపూర్ మండలంలోని సింగోటం, యన్మన్ బెట్ల గ్రామలలో మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలో సాగునీటి నీ మరింతగా వినియోగించుకునేలా ఆలోచన చేసి సీఎం కేసిఆర్ ని ఒప్పించి సింగోటం గోపాల్ దీన్నే రిజర్వాయర్ లింక్ కెనాల్ పనులకు శ్రీకారం చుట్టం అని, 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ ప్రజా ఆశీర్వాద సభ లో సీఎం కేసిఆర్ చెప్పారన్నారు.కానీ నేడు కొంత మంది అసత్యాలు ప్రచారం చేస్తూ జూపల్లి ఏం చేశాడు అని మాట్లాడుతున్నారు అని వాస్తవాలు ఎంటో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని వారికి ప్రజలే సరైన బుద్ది చెప్తారని జూపల్లి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జూపల్లి తో పాటుగా ఆయా గ్రామాల ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు మరియు జూపల్లి అనుచరులు పాల్గొన్నారు




