Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలందరికీ మేలు – జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఫిబ్రవరి 13 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో ప్రజలందరికీ మేలు జరుగుతుందని హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బూరుగడ్డ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హుజూర్ నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, స్థానిక సర్పంచ్ షేక్ సలీమారంజాన్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతి కుటుంబానికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో బిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వైద్య అధికారులను ఆదేశించారని తెలిపారు. హుజూర్ నగర్ మండలంలో ఇప్పటికే అమరవరం, అంజలిపురం గ్రామాల్లో కంటి వెలుగు ద్వారా వందలాదిమందికి కళాద్దాలు అందించడం జరిగిందని తెలియజేశారు. బూరుగడ్డ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ద్వారా ప్రతి ఒక్కరూ పరీక్షలు చేసుకుని ఏమైనా దృష్టి లోపాలు ఉంటే నిర్ధారించుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆదెమ్మ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గువ్వల వీరన్న, వార్డు సభ్యులు అలీ, నాగలింగం, నాగమ్మ, గండు చిన సైదులు, వేముల సైదులు, సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, బిఆర్ఎస్ నాయకులు కాసాని గోపాల్, యరగాని వెంకన్న, కీర్తి, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.