Wednesday, 4 November 2026

విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి : బి ఎస్ రావు : శామీర్ పేట్,

 

 

 

 

 

 

జనం సాక్షి : పేద విద్యార్థుల సంక్షేమమేలక్ష్యంగా కృషి చేస్తున్నట్లు చైతన్య ఎడ్యుకేషనల్ చైర్మన్ బి ఎస్ రావు అన్నారు. సోమవారం అలియబాద్ గ్రామంలో స్వచ్చందంగా చైతన్య ఎడ్యుకేషనల్ చైర్మన్ బి ఎస్ రావు నిర్మించిన ప్రైమరీ స్కూల్ ను సర్పంచ్ గుర్కా కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. బి ఎస్ రావును సర్పంచ్ కుమార్ శాలువాతో సత్కా రించారు.వార్డు మెంబర్లను, నాయకులను స్కూల్ యాజమాన్యం శాలువాలతో సత్కా రించారు.
ఈ సందర్బంగా చైర్మన్ బి ఎస్ రావు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం జడ్పీటీసీ అనితా, సర్పంచ్ కుమార్ లు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పడుతున్న బాధలు చూసి చైతన్య ఎడ్యుకేషనల్ చైర్మన్ బి ఎస్ రావు తన స్వంత నిధులతో నూతన పాఠశాలను నిర్మించి ఇచ్చి నందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి,నాయకులు కృష్ణారెడ్డి, లాలయ్య,ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు పుష్పలత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సింగ్ రావు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.13ఎస్పీటీ -2: నూతన పాఠశాల ప్రారంభిత్సవంలో బి ఎస్ రావు, సర్పంచ్ కుమార్