పెనుబల్లి, జనవరి 19(జనం సాక్షి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం పెనుబల్లి మండలం లో ప్రారంభించారు, ఈ సంధర్భంగా మండలంలో బయ్యన్నగూడెం , రామచంద్రరావు బంజర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఎంపిపి శ్రీమతి లక్కినేని అలేఖ్య , జడ్పిటిసి చెక్కిలాల మోహన్ రావు ప్రారంభిం చారు, కార్యక్రమంలో ఎం డి ఒ మహాలక్ష్మి, తహసీల్దార్ రమాడేవి, సర్పంచ్ లు, మండల స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, లంక సాగ ర్ పి హెచ్ సి వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సౌమ్య , డాక్టర్ మహేశ్వర రావు, కార్యదర్శులు, కంటి వెలుగు క్యాంపు సిబ్బంది ,పీహెచ్ఎన్ ప్రమీల, హెచ్ జి ఓ .శ్రీనివాస్ హెచ్ ఎస్ ప్రకాష్ రావు, నాగేశ్వరరావు ,పొట్టెమ్మ ,నిర్మల కుమారి ,ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్త లు ,అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




