క్రీడల వల్ల శరీర దృఢత్వం మానసిక ఉల్లాసం
ఉప సర్పంచ్ సంగ్యానాయక్
రేగోడ్ //జనం సాక్షి //జనవరి :
క్రీడాల వల్ల శరీర మానసికఉల్లాసం లభించ డంతోపాటు యువకులు ఆరోగ్యంగా ఉండి ఉత్తేజంగా క్రీడల్లో పాల్గొని ఉన్న ఊరుకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఉప సర్పంచ్ సంగ్యానాయక్ అన్నారు. రేగోడు మండల పరిధి పెద్దతండ పంచాయతీలో స్థానిక క్రికెట్ జట్టు సభ్యులకు తన సొంత డబ్బులతో జర్కిన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకుల అత్యధికంగా చరా వాణిలపై దృష్టిని పెట్టి క్రీడలపై ఆసక్తిని తగ్గిస్తున్నారని ప్రతి ఒక్క యువకులు చిన్న పెద్దలన్న తేడా లేకుండా కలిసికట్టుగా క్రీడల పై ఆసక్తిని చూపాలన్నారు. తన వంతు బాధ్యతగా క్రీడ కారులకు ప్రోత్సహిస్తానని వారు హామీ ఇచ్చారు. స్థానిక యువకులు క్రికెట్ తో పాటు మరెన్నో క్రీడల పై పట్టుదల చూపాలని క్రీడాకారుల వల్ల పెద్ద తండకు ప్రత్యేక గుర్తింపు రావాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుగుణ భాయ్, లక్ష్మణ్ నాయక్,రనీజ నాయక్, ధర్మ నాయక్, యువకులు, క్రీడాకారులు,తదితరులు పాల్గొన్నారు
క్రీడల వల్ల శరీర దృఢత్వం మానసిక ఉల్లాసం




