మల్దకల్ జనవరి 19 (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం ఎంపీపీ వై రాజారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ
అంధత్వ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కంటి వెలుగు రెండో విడుత కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.18 ఏండ్లు పైబడిన వారందరికీ పరీక్షలు చేస్తారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు గ్రామంలో ప్రతి ఒక్కరు కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.వైద్యాధికారులకు గ్రామ ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,సర్పంచ్ యాకోబు,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న, స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, తహసిల్దార్ హరికృష్ణ,ఎంపీడీవో కృష్ణయ్య, డాక్టర్ స్వరూపరాణి, బీఆర్ఎస్ నాయకులు నరేందర్,మధు పరశురాముడు,కో ఆప్షన్ నెంబర్ హైదర్ సాబ్, ఎంపిటిసి గోపాల్ రెడ్డి,తూము కృష్ణారెడ్డి,ఉపసర్పంచ్ సీకినా మల్దకల్, పంచాయతీ కార్యదర్శి మాబి,పద్మారెడ్డి,చంద్రశేఖర రావు,ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




