Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమాని సద్వినియోగం చేసుకోవాలి: ఎం పి పి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

కంటి వెలుగు కార్యక్రమాని సద్వినియోగం చేసుకోవాలి: ఎం పి పి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి
కొండమల్లేపల్లి జనవరి 10 జనం సాక్షి న్యూస్ :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న కంటి వెలుగు పథకంపై ఈరోజు కొండమల్లేపల్లి మండలం ఎంపీపీ రేఖ శ్రీధర్ రెడ్డి రెడ్డి గారి అధ్యక్షతన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో పరిషత్ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కంటిచూపు సమస్యతో బాధపడుతున్న వారు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోలేని వాళ్ళ కొరకు కేసిఆర్ గారు కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికి అదే గ్రామంలో కంటి పరీక్షలు చేసి, సమస్య లు ఉన్నవారికి తగిన మందులు ,కంటి పరికరాలు అక్కడ ఇచ్చి,ఆపరేషన్ లాంటిది అవసరమైతే దగ్గర్లో ఉన్న హాస్పిటల్లో చేయిస్తారని ఈ కార్యక్రమాన్ని మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలరాజు రెడ్డి, వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, మెడికల్ ఆఫీసర్ ఉషారాణి, ,సర్పంచ్ మండల ఫోరంఅధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, ,ఎంపిటిసిలు,వైద్య సిబ్బంది ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు