హోరాహోరీగా సాగిన ఖిజర్ యఫై గోల్డ్ కప్ ప్రి క్వార్టర్ ఫైనల్ పోటీలు
జహీరాబాద్ జనవరి 10( జనం సాక్షి) పట్టణంలోని భాగ రెడ్డి క్రీడా మైదానంలో మంగళవారం ఖిజర్ యఫై గోల్డ్ కప్ ప్రి క్వార్టర్ పోటీల్లో భాగంగా షా బార్కస్ హైదరాబాద్ సీసీ మరియు గ్రీన్ సిటీ సీసీ జట్ల మధ్య జరిగిన పోటీలో షా బార్కస్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తూ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టనికి 115 పరుగులు చెయ్యడంతో, 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్రీన్ సిటీ సీసీ 12.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టనికి 116 పరుగులు చేయడంతో గ్రీన్ సిటీ సీసీ షా బార్కస్ జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఖిజర్ యఫై గోల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది, ఐదవ ప్రి క్వార్టర్ ఫైనల్లో కలిమ్ జైనూర్ సీసీ మరియు అప్ఫన్ సీసీ అచ్చంపేట జట్ల మధ్య జరిగిన పోటీలో కలిమ్ జైనూర్ సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ చేయడంతో జైనూర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టనికి 151 పరుగులు చేయడంతో, 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఫన్ సీసీ అచ్చంపేట జట్టు జట్టు 15.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టనికి 154 పరుగులు చెయ్యడంతో 5 వికెట్ల తేడాతో అప్ఫన్ సీసీ జట్టు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది, జట్టు విజయంలో కీలక భూమిక వహించిన రితేష్ భట్కల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది, ఈ సందర్భంగా ముఖ్య అతిధి పాల్గొన్న శేకపూర్ తండా సర్పంచ్ నాగు చవాన్ మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని, క్రిడ మైదానంలో రాబోయే రోజుల్లో ఇలాంటి మంచి ప్రదర్శనలు మరిన్ని కనబర్చలని అన్నారు. కార్యక్రమంలో మొహమ్మద్ అలీ, మొహమ్మద్ మాక్సుద్, సయ్యద్ విఖర్, మర్రి బాల్ రెడ్డి, సద్దమ్ కుసంగి, తజోద్దీన్ శేకపూర్, గౌస్ ఖాన్, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ శేకపూర్, అదం యఫై, అబుద్ యఫై, పబ్బతి సంతోష్, రాయికోటి నర్సిములు, తయ్యబ్ అలీ, మద్ద రామి రెడ్డి, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, ఖాజా పటేల్, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఆర్షద్ ఖాన్, ఆసీఫ్ పటేల్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.




