Wednesday, 4 November 2026

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయండి

టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయండి
* టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్

టేకులపల్లి, జనవరి 10( జనం సాక్షి ): ఈ నెల 13, 14 వ తేదీలలోరంగారెడ్డి జిల్లాలోని సార్థ కన్వెన్షన్ హాల్లో జరిగే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు భూక్య కిషోర్ సింగ్ కోరారు. మంగళవారం ఎంపీపీ ఎస్ టేకులపల్లి లో జరిగిన టీఎస్ యుటిఎఫ్ మండల ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్ర మహాసభలకు టీఎస్ యుటిఎఫ్ నాయకులు, కార్యకర్తలు, విద్యా భిమానులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ మహా సభలకు ముఖ్య అతిదులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కేరళ రాష్ట్ర శాశన సభ్యులు, మాజీ మంత్రి కె. కె శైలజ టీచర్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరు అవుతున్నారని ఆయన తెలిపారు. ఈ మహాసభలు ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ,ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా మారిన సిపిఎస్ విధానాన్నీ రద్దు చేసి పాత పెన్షన్ విధానమును పునరుద్ధరించాలని, ప్రభుత్వ విద్యారంగమును ప్రవేటికరణ వైపు నెట్టేటివంటి ఎన్ ఈ పి 2020 ని రద్దు చేయాలని పలు తీర్మానాలను ఈ మహా సభలో చర్చించడం జరుగుతుంది అన్నారు. అదే విదంగా ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సౌకర్యాలు కల్పించాలని, గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్స్ కల్పించాలని, 2023 జులై నుండి రావలసిన పి ఆర్ సి కమిటీని వెంటనే నియమించాలని పలు డిమాండ్లతో మహాసభలు జరుగుతాయని తెలిపారు. అదేవిదంగా గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, ఆ శాఖలోని ఉపాధ్యాయులకు , ఏ టి డి ఓ, డిడి , అడిషనల్ డైరెక్టర్ గా పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వానిక