Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి అన్నారు

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి అన్నారు

వీణవంక జనవరి 11 (జనం సాక్షి) వీణవంక మండలంలోని స్థానిక ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు
ఈనెల 18 నుంచి వంద రోజులపాటు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాలను ప్రతి గ్రామంలో ప్రజలందరూ పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన మండలంలోని అంద త్వాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు పని చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యాధికారులు డాక్టర్ అరుణ , వివిధ గ్రామాల సర్పంచులు,మండల సర్పంచ్ ఫోరం అద్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి పొదిల జ్యోతి రమేష్ ఎంపీటీసీలు, ఎలవేణి సవిత మల్లయ్య గ్రామపంచాయతీ కార్యదర్శులు తో పాటు అధికారులు పాల్గొన్నారు…..