Thursday, 5 November 2026

పోటీ పోటీన కుస్తీ పోటీలు – బహుమతిని అందజేసిన డిఎస్పి

పోటీ పోటీన కుస్తీ పోటీలు

– బహుమతిని అందజేసిన డిఎస్పి

జహీరాబాద్ జనవరి 11 (జనం సాక్షి ) జహీరాబాద్ కోహిర్ నియోజకవర్గంలో కోహీర్ మండల కేంద్రంలో మంగళవారం మౌలానా మొయిజుద్దీన్ తుర్కీ రహేమతుల్ల జాతరను పురస్కరించుకుని నిర్వాహకులు కుస్తీ పోటీలను ఏర్పాటు చేశారు,. కుస్తీ పోటీలను దర్గా కమిటీ బాద్యులు షౌకత్ అలీ పర్యవేక్షణలో జరిగాయి, మల్లయొదులు కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుంచి తలపడ్డారు, కుస్తీ పోటీలను స్థానిక జహీరాబాద్ డిఎస్పీ వి రఘు, జహీరాబాద్ పట్టణ సర్కిల్ ఇన్స్ పెక్టర్ తోట భూపతి, బి ఆర్ ఎస్ నాయకులు ఖిజర్ యఫై ప్రారంభించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డిఎస్పి వీ రఘు మాట్లాడుతూ జాతరను పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాటుచేసిన కుస్తీ పోటీలు ఆరోగ్యవంతంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరగడం అభినందనీయమని కోహిర్ లాంటి ప్రాంతంలో ఇంత మంచి కుస్తీ పోటీలు జరగడం నిర్వాహకులు చేస్తున్న కృషికి నిదర్శనమని దేశం లోని నలుమూలల నుంచి మల్లయోధులు పాల్గొనడం వారి అంకితభావానికి నిదర్శనమని కుస్తీల్లో చిత్తు అయినా మల్ల యోధులు నిరాశకు గురి కాకుండా ముందు ముందు జరగబోయే మల్లయుధుల పోటీలకు సిద్ధం కావాలని ఇప్పుడు జరిగిన పొరపాట్లను సవరించుకొని రాబోయే రోజుల్లో జరిగే పోటీల్లో మరింత సమాయత్తమవ్వాలని మల్లయోధులకు డిఎస్పి వి.రఘు సిద్దం కావాలని సూచించారు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు ఖిజర్ యఫై, బిలాల్ పూర్ సర్పంచ్ నర్సింలు, కోహిర్ మండల వైస్ ఎంపిపి షాకిర్ అలీ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మ్యాతరి ఆనంద్, కమిటీ అధ్యక్షుడు షౌకత్ అలీ, ఉప సర్పంచ్ మోహసీన్ అలీ, బాణోత్ పాండు నాయక్, శేకపూర్ తండా సర్పంచ్ నాగు చవాన్, మాక్సుద్ ఖాన్, గౌస్ ఖాన్, ఖాజా పటేల్, యదుల్లా తదితరులు ఉన్నారు.