Thursday, 5 November 2026

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు

శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు
హుజూర్ నగర్ జనవరి 11 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పోసాని వెంకటరమణారావు మాట్లాడుతూ విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియాలని, వాటిపై అవగాహన కల్పించాలని, వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండ్లు పోశారు. పాఠశాల ఆవరణలో ముగ్గులను వేశారు. హరిదాసులతో చిన్నారుల కోలాటాలతో సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. అనంతరం భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జిలు సంధ్య, సౌజన్య , ప్రేమ్ సాగర్, ఏవో వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.