హుజూర్ నగర్ జనవరి 19 (జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంను హుజూర్ నగర్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు పద్మశాలి భవనం నందు, 14వ వార్డు అంబేద్కర్ కాలనీ లోని ప్రాథమిక పాఠశాల నందు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లీ అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, ఆర్డిఓ వెంకా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
హుజూర్ నగర్ లో కంటి వెలుగు కార్యక్రమంను ప్రజలందరూ వినియోగించుకోవాలి




