Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి..

 

ఎమ్మెల్యే మదన్ రెడ్డి

జనం సాక్షి/ కొల్చారం మండలంలో నర్సాపూర్ ఎమ్మెల్యే చిరున మదన్ రెడ్డి పర్యటించారు. ఏటిగడ్డ మాదాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమంలో నాణ్యమైన అద్దాల సరఫరా చేస్తుందని వాటిని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించారు. వందరోజుల ప్రణాళికలో భాగంలో ప్రతి గ్రామంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్ . మండల అధ్యక్షుడు సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పేరోల్ల విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపీడీవో గణేష్ రెడ్డి. రాంపూర్ సర్పంచ్ రామ్ రెడ్డి రవితేజ రెడ్డి దొడ్ల ఆంజనేయులు రాజా గౌడ్. తో పాటు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.