కౌడిపల్లి (జనం సాక్షి).. చెందడంతో తమ వంతు సహాయంగా స్నేహితుని కుటుంబానికి ఒక్క లక్ష ఒక వంద రూపాయలు ఇచ్చి తమ స్నేహ బంధాన్ని చాటుకున్నారు 1998- 99 పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు.పూర్తి వివరాలలోకి వెళ్తే కౌడిపల్లి మండల పరిధిలోని పీర్ల తాండ గ్రామపంచాయతీ లోని వీర మాన్సింగ్ తండాకు చెందిన సురేందర్ 1998- 99లో కౌడిపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు విద్యానభ్యసించారు. ఈ మధ్యకాలంలో తన తండాలో నూతనంగా గృహం నిర్మించుకొని నివసిస్తున్న క్రమంలో ఇంట్లో కరెంటు వైర్ రిపేర్ చేస్తున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి సురేందర్ మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు తమతో పాటు చదువుకున్న సురేందర్ కుటుంబానికి తమ వంతు ఆర్థిక సహాయం చేద్దామని స్నేహితులందరూ పూనుకున్నారు. నేటి కంప్యూటర్ జీవితంలో ఎవరి పనులు వారు చేసుకుంటూ బిజీగా గడుపుతున్న తరుణంలో స్నేహితుడు చనిపోయిన మరణ వార్తను తెలుసుకొని పూర్వ విద్యార్థులందరూ తమకు తోచినంతగా డబ్బులు పోగుచేసుకొని సురేందర్ భార్యకు ఆర్థిక సహాయం అందజేయడం హర్షించదగ్గ పరిణామమని పలువురు తెలిపారు. డబ్బులు ఉంటేనే బంధాలు, బంధుత్వాలు అంటూ నేడు ఆప్యాయత అభిమానాలు కురిపించే తరుణంలో,తమతో పాటుగా విద్యను అభ్యసించిన స్నేహితుడు అకాల మృతి చెందడం, వారి కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడం జీర్ణించుకోలేని స్నేహితులు చనిపోయిన సురేందర్ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి, కుటుంబీకులకు మనో ధైర్యం కల్పించడం హర్షించదగ్గ పరిణామం. కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్వ విద్యార్థి మండల కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ హైమద్ మాట్లాడుతూ ఇకముందు నుండి తమతో పాటు విద్యానభ్యసించిన స్నేహితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తామందరం ముందుండి ఎవరికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటామని,స్నేహానికి ప్రతిరూపం స్నేహితులు మాత్రమేనని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం స్నేహితుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నాగరాజు,చిలుముల అమరేందర్,దన్ను, రామకృష్ణ, అక్బర్, జగన్, రవి, రాజు,షఫీ, కృష్ణ, వెంకటేశ్వర్, యాదుల్, ధర్మసాగర్ రాజు, సురేష్ సత్యనారాయణ తోపాటు పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
తమతోపాటు విద్యను అభ్యసించిన స్నేహితుడు అకాల మరణం




