Thursday, 5 November 2026

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని

 ఆకస్మికంగా తనకి చేసిన ఉమ్మడి దేవరకొండ మండల విద్యాధికారి మాతృనాయక్ కొండమల్లేపల్లి జనవరి 23 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి దేవరకొండ మండల విద్యాధికారి మాతృనాయక్ అకస్మాత్తుగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక అమలు తీరును తెలుసుకున్నారు ఈ సందర్భంగా,ఉపాధ్యాయులు, విద్యార్దుల యొక్క హాజరు పట్టిక పరిశీలించి, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పధకం అమలు చేస్తున్నదీ లేనిదీ విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. ఆహార పదార్ధాలను పరిశీలించి భోజనం రుచికరముగా ఉన్నదీ, లేనిదీ తెలుసుని భోజన నిర్వాహకులతో చర్చించారు. ఎనర్జీ ఫుడ్ టైం టు టైం అందుతున్నదీ లేనిదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టిక ఆహారాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు వారి వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ మరియు పాఠశాల ఉపాధ్యాయులు కొర్ర లోక్య నాయక్ మరియు వంట సిబ్బంది ముత్యాలమ్మ లక్ష్మమ్మ సునీత నాగమణి ఈదమ్మ తదితరులు పాల్గొన్నారు