Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 

 

 

 

 

కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్.సిరిసిల్ల. జనవరి 27. (జనం సాక్షి) . కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ కోరారు. శుక్రవారం 34 వార్డులో ఏర్పాటుచేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని అన్నారు. ప్రభుత్వపరంగా అన్ని వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారని గుర్తు చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు అవసరమైన వారికి కండ్లద్దాలు ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజల సద్విని చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించిన ప్రభుత్వానికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు సేవలు అందించారు. ఆర్పీలు సుమలత రుచిత ఆశ వర్కర్లు పాల్గొన్నారు