కొండమల్లేపల్లి జనవరి 27 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని దేవరోని తండా గ్రామపంచాయతీలో శుక్రవారం నాడు కంటి వెలుగు కార్యక్రమాన్ని కొండమల్లేపల్లి వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చి ప్రారంభించారు ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని దేవరోని తండా గ్రామ ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని అన్నారు కంటి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, కంటి జబ్బులు ఉన్న, డాక్టర్స్ తో తెలపాలని అనంతరం డాక్టర్స్ వారు ఇచ్చే మందులను కానీ కంటి అద్దాలను కానీ తీసుకోవాలని అన్నారు ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరమని ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రసూల్, డాక్టర్ మహేష్, సూపర్ వైజర్ రాణి, ఏఎన్ఎం లు శ్రీదేవి, లలిత, మరియు ఆశా వర్కర్స్ పంచాయతీ సెక్రెటరి కిరణ్ కుమార్, వర్కాల సత్యనారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




