Wednesday, 4 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి 5 వ వార్డు లో కంటి వెలుగు ప్రారంభోత్సవంఈ రోజు స్థానిక 5 వ వార్డు ఈదులగూడ ప్రాధమిక ఉన్నత పాఠశాల లో కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ 5వ వార్డు ముదిరెడ్డి నర్సిరెడ్డి, ఉప వైద్య అధికారి  డాక్టర్ కేసా రవి తో కలిసి ప్రారంభించారు 5 వ వార్డు ఈదులగూడ మరియు హోసింగ్ బోర్డు ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరు కోరారు. 18 సంవత్సరాలు నిండిన వారు మరియు వృద్ధులు అందరికి ఉచితంగా పరీక్షలు చేసి కళ్లద్ధాలు ఇవ్వబడునని, ఆపరేషన్ అవసరం వున్న వారికి ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తారని తెలిపారు కావున ఈ రోజు నుండి 20 వ తారీకు వరకు కంటి పరీక్షలు నిర్వహించబడును కావున వార్డు ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి  బాలాజీ నాయక్,5 వవార్డ్ బారస  అధ్యక్షులు పల్నాటి జానకి రెడ్డి, పుట్టపాక శ్రీనివాస్, జన్నపాలా కిరణ్, అమిరెడ్డి రాంచంద్రారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి, ఆరోగ్య సిబ్బంది డాక్టర్ శిరీష, శ్రీధర్, సూపర్వైజర్ రాంబాబు, ఏ న్ ఎం లు విజయలక్ష్మి, మాధవి,  రోజా, ఆశా వర్కర్లు స్రవంతి, నవ్య, అంగన్వాడీలు పార్వతి, రజిత తదితరులు పాల్గొన్నారు.