మిర్యాలగూడ, జనం సాక్షి.పార్టీలకు అతీతంగా బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో పేదింటి ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం డిపాజిట్లను చెల్లించనున్నట్లు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) తెలిపారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
బిఎల్ఆర్ మాట్లాడుతూ పార్టీలకు సంబంధం లేకుండా 0-10 సంవత్సరాల ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఒక్కొక్కరికి 250 రూపాయల డిపాజిట్ చెల్లించి కార్డును ఇంటింటికి వెళ్లి బిఎల్ఆర్ బ్రదర్స్ అందజేయనున్నారని పేర్కొన్నారు. బిఎల్ఆర్ బ్రదర్స్ చేపడుతున్న డిపాజిట్ల కార్యక్రమాల విధి, విధానాలను, ఈనెల 18న ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అప్పటివరకు డిపాజిట్ చేసిన వారి కార్డులను అదే రోజు ఇంటికి వెళ్లి అందజేస్తారని వివరించారు. మిర్యాలగూడ నియోజకవర్గం లో అంతట ఈ పథకం అమలు చేసేందుకు బిఎల్ఆర్ బ్రదర్స్ చేయూత అందించనున్నారని అని తెలిపారు. మొదటి విడతగా నియోజకవర్గంలో ఎంతమందికి డిపాజిట్ చెల్లించనున్నారోఅనే విషయాన్ని ఈ నెల 18న ప్రకటించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్, డిసిసి జిల్లా మాజీ కార్యదర్శి చిలుకూరి బాలు, మున్సిపల్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, జానీ, రామకృష్ణ, పందిరి అనిత, రవి నాయక్, కాంగ్రెస్ వార్డు ఇన్చార్జులు మోయిజ్, ఇమ్రాన్, అబ్దుల్లా, తోపాటు యువజన కాంగ్రెస్ మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు అజహరుద్దీన్, శ్రీనివాస్, గౌస్, సలీం, తదితరులు పాల్గొన్నారు.




